ఈ విషయంలో వైసీపీ అట్టర్ ఫెల్యూర్

ఈ విషయంలో వైసీపీ అట్టర్ ఫెల్యూర్

0
104

టీడీపీ మాజీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం ఏపీలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు ఏం కొనేటట్లు లేదని అన్నారు… ఇక నుంచి ఏం తినేటట్లు లేదని ఎద్దేవా చేశారు.

అయితే వీటి గురించి ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు లోకేశ్.. ఉల్లి కోయకుండానే మా అక్కాచెల్లెళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. పనులు లేకుండా చేసారని మండిపడ్డారు

అప్పో, సొప్పో పూట గడుపుకుందామనుకుంటే సంచి కూరగాయలు రావాలి అంటే బస్తా డబ్బులు పట్టికెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కూరగాయల ధరలు నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. 45ఏళ్లకే మహిళలకు పెన్షన్ అని మోసం చేసారు. ఇప్పుడు కనీసం కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు