ప్రపంచంలో దాదాపు 210 దేశాలలలో ఈ వైరస్ ప్రభావం ఉంది, అన్నీ దేశాలు కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి, అంతేకాదు పెద్ద ఎత్తున ప్రచారం చేసి బయటకు రావద్దని , అత్యవసర సమయంలో బయటకు వస్తే మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలి అని చెబుతున్నాయి, అన్నీ ప్రాంతాల్లో ఇదే సలహా ఇస్తున్నారు.
కొందరు మాస్క్ పెట్టుకుంటే, మరికొందరు పెట్టుకోవడం లేదు.. దీని వల్ల వైరస్ ప్రబలే ప్రమాదం ఉంది, అందుకే కొన్ని దేశాలు చాలా కఠినంగా ఉంటున్నాయి ఈ విషయంలో.. గల్ఫ్ దేశం ఖతార్ ఈ విషయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. సామాజిక దూరాన్ని పాటించడం, ముఖాలకు మాస్కులను ధరించడం తప్పనిసరి చేసింది.
ఇలా ఎవరైనా నియమాలు పాటించకపోతే కచ్చితంగా భారీగా ఫైన్ వేస్తోంది.
ముఖానికి మాస్క్ ధరించకుండా బయటకు వస్తే 2 లక్షల రియాల్స్ ఇంచుమించు రూ. 42 లక్షల జరిమానాతో పాటు, మూడేళ్లు జైలుకు కూడా పంపనుంది. ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిస్తోంది, ఇప్పటికే అక్కడ 28 వేల కేసులు నమోదు అయ్యాయి, అక్కడ జనాభా కూడా 28 లక్షలు దీంతో కేసులు పెరగకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది.