Flash: అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడగింపు

Extension of ban on international flights

0
304

కరోనా కారణంగా మరోసారి భారత్ లో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు, అన్ని ఎయిర్‌పోర్టులకు, ఇమిగ్రేషన్ బ్యూరో కమిషనర్‌కు పంపింది.

ఈ నిషేధం కార్గో విమానాలపై వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. అలాగే డీజీసీఏ అనుమతి పొందిన విమానాలపై కూడా ఈ నిషేధం ప్రభావం ఉండబోదని వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత డెల్టా వేరియంట్ కారణంగా ఇతర దేశాలు కూడా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇప్పుడిప్పుడే భారత్ నుంచి వచ్చే విమానాలపై కొన్ని దేశాలు నిషేధాన్ని తొలగిస్తున్నాయి.

కాగా, కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ ఏడాది అంతర్జాతీయ విమానాలపై డీజీసీఏ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.