వైఎస్సార్ కు తీరని అన్యాయం..కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

0
156

తెలంగాణ సీఎం కేసీఆర్ పై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. నేడు వైయస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైయస్సార్ టిపి స్థాపించిన సంవత్సర కాలంలోనే ఎంతో పురోగతి సాధించింది. ఎల్లప్పుడూ ప్రజలతోనే గడుపుతున్నాం.

పార్టీ పెట్టకముందు నుంచే నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఇంకా కొనసాగిస్తానని అన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీకి తెలంగాణలో సెంటు భూమి కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటని టిఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.

“టిఆర్ఎస్ భవన్ వైయస్సార్ ఇచ్చిందే అని.. కెసిఆర్ రాజశేఖర్ రెడ్డికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తూనే ఉన్నానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె వాపోయారు.