గన్నవరం ఎమ్మెల్యే వంశీకి గుడ్ న్యూస్ చెప్పిన స్పీకర్

గన్నవరం ఎమ్మెల్యే వంశీకి గుడ్ న్యూస్ చెప్పిన స్పీకర్

0
35

మొత్తానికి వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.. తీసుకునే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అంతుచిక్క కుండా ఉన్నాయి.. ముఖ్యంగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.. అంతేకాదు పార్టీ కూడా సస్పెండ్ చేసింది.. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించడంపై టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. వంశీని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారని టీడీపీ సభ్యులు స్పీకర్ను ప్రశ్నించారు.

దీనికి ఆయన సరైన సమాధానం చెప్పారు, ఆయన ఏ పార్టీలో లేరు.. పార్టీ నుంచి తెలుగుదేశం సస్పెండ్ చేసింది. ఆయన వైసీపీలో చేరలేదు మరి ఆయన ఏ రాజకీయ పార్టీకి సభ్యుడు కాదు. అందుకే ప్రత్యేకంగా గుర్తించానని స్పీకర్ స్పష్టం చేశారు.. తనకు ఉండే విచక్షణ అధికారాలు ఉపయోగించి ప్రత్యేక ఎమ్మెల్యేగా సభలో గుర్తించాను అని తెలిపారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండని వంశీకి స్పీకర్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. 181,182,183 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఏది కావాల్నో కోరుకోండని స్పీకర్ వంశీని అడిగారు. మొత్తానికి వంశీ చేత వచ్చే సమ్మర్ అసెంబ్లీ సమావేశాలకు రాజీనామా చేయిస్తారు అని మరో వార్త కూడా వినిపిస్తోంది, మళ్లీ గన్నవరం నుంచి వైసీపీ తరపున టికెట్ కూడా ఇస్తారు అని అంటున్నారు చూడాలి.