ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయే క్లారిటీగా చెప్పలేక పోతున్నారు తమ్ముళ్లు… గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు…
ఇక ఇదే క్రమంలో మరో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు…. గతంలో టీడీపీ తరపున కీలకంగా వ్యవహరించిన డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్యాల రత్నం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకోనున్నారు…
ఈ మేరుకు అధికార పార్టీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారట… ముత్యాల రత్నంలకు ఉండి నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా మంచి పట్టుఉంది ఆయన వైసీపీలో చేరితే పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…