భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
62

నేడు పుత్త‌డి ధ‌ర త‌గ్గింది. బంగారం ధ‌ర మ‌ళ్లీ మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది, బంగారం ధ‌ర గ‌డిచిన వారం రోజులుగా త‌గ్గుతూ పెరుగుతూ వ‌స్తోంది, నేడు కూడా మార్కెట్లో త‌గ్గింది బంగారం ధ‌ర, పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,820కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.250 తగ్గింది. దీంతో ధర రూ.49,340కు దిగొచ్చింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.900 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.67,000కు చేరింది. ఇంకా వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్ల‌లో పెట్టుబ‌డులు మ‌ధుప‌రులు పెట్ట‌డంతో భారీగా బంగారం ధ‌ర త‌గ్గుతోంది, వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంటుంది అని అంటున్నారు అన‌లిస్టులు.