ప్రజలకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద రెండు విడతలుగా డబ్బులు జమ చేశారు. ఇక తాజాగా నేడు మూడో విడత డబ్బులు బటన్ నొక్కి జమ చేశారు.
కాగా జగన్ తన హయాంలో నవరత్నాలు పథకాన్ని ప్రతిష్టత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలు ఉన్నాయి. నేడు మూడో విడత కాపు నేస్తం డబ్బులు విడుదల చేశారు సీఎం.
ఈ సందర్బంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 1.2 లక్షల మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం కూడా మొదలయ్యిందని అన్నారు. కాపులకు ప్రతి ఏటా రూ.వేయి కోట్లు ఐదేళ్ల కాలంలో రూ.5 వేల కోట్లు పెడతానని చెప్పి, కనీసం రూ.1500 కోట్లూ ఖర్చు పెట్టని చంద్రబాబు పాలనలో పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.