రైతులకు గుడ్ న్యూస్..ధాన్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన

0
120

తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలు తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..కేంద్ర మంత్రులు తెలంగాణలోని కేసిఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. పేదలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని అన్నారు. పేదలకు ఇంత అన్యాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని పీయూష్ గోయల్ విమర్శించారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ క్లియరెన్స్ ఇస్తుందని చెప్పారు పీయుష్ కుమార్. పేదలకు సాయం చేసేందుకు కేంద్రం చిత్తశుద్దితో పని చేస్తోందని తెలిపారు.

దేశం మొత్తం మీద 80 కోట్ల మందికి అయిదు కేజీల చొప్పున అదనపు ధాన్యం ఇస్తున్నామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజకీయ అజెండాతో కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ ప్రతిదీ రాజకీయం చేయకుండా పేదల గురించి ఆలోచించాలని హిత బోధ చేశారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులపై తెలంగాణ సీఎం, మంత్రులు చాల అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసిఆర్ అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.