వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..RTO ఆఫీస్ కు వెళ్లనక్కర్లేదు..ఎందుకో తెలుసా?

0
39

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలకు సంబంధించిన సేవలు మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాహన రిజిస్ట్రేషన్, ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్, డ్రైవింగ్ లైసెన్స్ సహా పలు సేవలను ఆన్ లైన్ లో అందించనున్నారు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే డ్రైవింగ్ లైసెన్స్ కోసం భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్, లైసెన్స్ రెన్యూవల్ కోసం ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చన్నారు. అలాగే వాహన ఓనర్ షిప్, కండక్టర్ లైసెన్స్ లో అడ్రస్ మార్పు, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ సేవలు ఆన్ లైన్ లోనే లభిస్తాయని తెలిపింది.

ఈ నిర్ణయం వల్ల వాహనదారులకు కొంతమేర భారం తగ్గుతుంది. అంతేకాదు సమయం, డబ్బు కూడా కొంతమేర ఆదా అవుతుంది. అలాగే ఆర్టీఓ కార్యాలయాలపై భారం తగ్గి పని సులువు అవుతుందని పేర్కొన్నారు.