విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్..MBBS సీట్ల పెంపుపై కీలక నిర్ణయం

0
139

తెలంగాణ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 1200 ఎంబిబిఎస్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. పెరిగిన సీట్లు 2022-23 వైద్యవిద్య సంవత్సరంలోనే అందుబాటలోకి రానున్నాయి. మరి ఏ జిల్లాలోని కాలేజీలో పెరిగిన సీట్లు కేటాయించారు? మొత్తం ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

అయితే ఇప్పటికే పెరిగిన సీట్లలో 900 సీట్లకు అనుమతి లభించింది. మిగతా 300 సీట్లకు పర్మిషన్ రావాల్సి ఉంది. కాగా మహబూబాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం వైద్య కళాశాలలకు ఒక్కో దాంట్లో 150 చొప్పున కొత్తగా 900 సీట్లకు అనుమతి లభించింది. రామగుండంలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) జాతీయ వైద్య కమిషన్‌ ఇప్పటికే పంపించింది. ఇక మంచిర్యాలకు మాత్రమే అనుమతి రావాల్సి ఉంది. ఈ కళాశాలకు కూడా 150 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

2022-23 వైద్యవిద్య సంవత్సరంలో పెరిగిన సీట్లతో మొత్తం  6,240 అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే గతేడాది టీఆర్‌ఆర్‌, మహావీర్‌, ఎంఎన్‌ఆర్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎన్‌ఆర్‌ కళాశాలకు తాజాగా అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఆర్‌, మహావీర్‌ కళాశాలల్లోనూ తుదివిడత తనిఖీలు పూర్తి చేసినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. దీనితో ఇందులోనూ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.