తెలుగుదేశం పార్టీకి ఆళ్లగడ్డలో మరోసారి విజయం తథ్యం అనేలా ఉంది అక్కడ పరిస్దితి.. ఇది వైసీపీకి మింగుడు పడని స్దితిలో పడేసింది. ముఖ్యంగా మంత్రిగా అఖిల ప్రియ ఇక్కడ చేసిన సేవలు అందరికి నచ్చాయి. అయితే భూమా కుటుంబానికి గంగుల కుటుంబానికి ఎన్నో దశాబ్దాలుగా వైరం ఉంది. ఇప్పుడు రెండు కుటుంబాల నుంచి వారసులు రాజకీయంగా ఎన్నిక్లలో తలపడుతున్నారు. ఇక్కడ జనం కూడా ఇదూ చూస్తున్నారు.. అయితే మంత్రిగా అఖిల ఎంతో అభివృద్ది చేశారు అని చెబుతున్నారు ఇక్కడ జనం.
మరో వైపు ఆళ్లగడ్డలో వైసీపీకి కేడర్ కూడా చాలా వరకూ వీక్ అనే సర్వేలు వచ్చాయి. అయితే ఇక్కడ గంగుల నాని ఎన్నికల్లో గెలిచేందుకు ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నా, ప్రజల్లో మాత్రం అఖిలకు పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంటోంది. ఇటీవల డబ్బులు వెదజల్లుతూ ఆళ్లగడ్డలో వైసీపీ నాయకులు చేసిన అత్యుత్సాహ ప్రదర్శన ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు అఖిల.
ఇక్కడ జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.. భూమా కుటుంబం పై విమర్శలు చేయడం, నంద్యాల ఎన్నికల సమయంలో నాగిరెడ్డిపై విమర్శలు అలాగే, అఖిలకు చివరి సమయంలో వారి కుటుంబం పై నంద్యాల నుంచి శిల్పా బ్రదర్ ని పోటికి నిలపడం ఇవన్నీ కూడా జగన్ కు నంద్యాల ఆళ్లగడ్డలో భూమా కేడర్ లో వ్యతిరేకతను పెంచాయి.. అయితే ఇప్పుడు సుమారు 35 వేల నుంచి 40 వేల మెజార్టీ అఖిలకు వచ్చే అవకాశం ఉంది అని సర్వేలు కూడా చెబుతున్నాయట.. మరో పక్క ఏవీ సుబ్బారెడ్డి వర్గం కూడా కొందరు అఖిలకు సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి అఖిల సూపర్ సక్సెస్ అవుతుంది అంటున్నారు ఇక్కడనేతలు.