రాజకీయాల్లోకి హర్భజన్, యువరాజ్ సింగ్‌?..క్లారిటీ ఇచ్చిన భజ్జీ

Harbhajan, Yuvraj Singh into politics? .. Bhajji given by Clarity

0
86

టీమిండియా మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు వచ్చాయి. ఢిల్లీ క్రౌన్ అనే మీడియా సంస్థ .. హర్భజన్ సింగ్‌ను ఒక ట్వీట్‌లో ట్యాగ్ చేసింది. పంజాబ్ బీజేపీ హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌పైదృష్టి పెట్టిందని.. వారిద్దరూ త్వరలో బీజేపీలో చేరవచ్చు అని ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‎పై హర్భజన్ సింగ్ స్పందించాడు. “ఫేక్ న్యూస్” అంటూ కొట్టిపడేశాడు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని భజ్జీ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ప్రజలు పట్టించుకోరాద్దని సూచించాడు. 2017లో కూడా హర్భజన్ సింగ్‎పై ఇలాంటి ప్రచారమే జరిగింది. అతను కాంగ్రెస్ చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ట్వీట్ పై యువరాజ్ సింగ్ ఇప్పటి వరకు స్పందించలేదు.

రాజకీయాల్లోకి క్రికెటర్లు రావడం కొత్తేమీ కాదు. అజారుద్దిన్, మహ్మద్ కైఫ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గౌతమ్ గంభీర్ వంటి క్రికెటర్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే, భారత జట్టులో కీలక ఆటగాళ్లు, అనేక విజయాలను అందించిన క్రికెటర్ల చూపు ఇప్పుడు రాజకీయాల వైపు మళ్లినట్లు కనిపిస్తుంది.

https://twitter.com/harbhajan_singh