ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… తనను క్రమశిక్షణ లేని వ్యక్తి అని చంద్రబాబు నాయుడు నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు… క్రమ శిక్షణ స్నేహం అనే పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు నాయుడే అని తీవ్ర స్థాయిలో మోహన్ బాబు మండిపడ్డారు
చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.
నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావును అలాగే నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు…. చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే అని గుర్తు చేశారు
అయితే క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!