టీడీపీ నాయకుడు నారా లోకేష్ పై హోంమంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు

Home Minister Sucharitha sensational comments on TDP leader Nara Lokesh

0
138

టీడీపీ నాయకుడు నారా లోకేష్ శుక్రవారం నాడు కర్నూలు జంట హత్యల తర్వాత అంత్యక్రియలకు హాజరైయ్యారు. అనంతరం మీడియా ముందు ఏపి సియం జగన్ పై విమర్శలు చేస్తూ మాట్లాడిన మాటలు  వివాదాస్పదంగా మారాయి. ఈ  నేపధ్యంలో నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏపి హోంమంత్రి సుచరిత మండిపడ్డారు.

టిడిపి అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం , హత్యలు చేస్తామని చెప్పకనే చెబుతున్నట్లు ఉందని ఇది హేయమైన చర్య అన్నారు హోంమంత్రి సుచరిత.

టీడీపీ నాయకులు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిపద్ధతి కాదన్నారు. వ్యక్తిగత కారణాలను కూడా టిడిపి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందన్నరు.టీడీపీ నాయకులకు శవ రాజకీయాలు చేయడం అలవాటైందని  హోంమంత్రి మండిపడ్డారు.

ప్రభుత్వంపై ఉద్దేశ్యపూర్వకంగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదని స్పష్టంచారు .కులం, మతం, ప్రాంతం, పార్టీ లని కూడా చూడకుండా ప్రతిఒక్కరికీ మంచి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ గారు అని కొనియాడిన హోంమంత్రి.

టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చలేదు కనుకనే ఘోరమైన ఓటమి పొందారని, టీడీపీ హయాంలో జరిగిన రాజకీయ హత్యల గురించి ప్రజలందరికీ తెలుసన్నారు.ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న మంచి పేరును చూసి టీడీపీ ఓర్వలేక పోతోందన్నారు హోంమంత్రి సుచరిత.