జగన్ ఆ తప్పు చేస్తే టీడీపీ వదిలిపెట్టదు

జగన్ ఆ తప్పు చేస్తే టీడీపీ వదిలిపెట్టదు

0
86

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో రెండు నెలల్లో రాజ్యసభ సీట్ల పందేరం జరగనుంది అని తెలుస్తోంది ఈసారి రెండు సీట్లు రానున్నాయి. ఈ రెండు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే ఈ రెండు సీట్ల విషయంలో ఇప్పటికే పార్టీలో పెద్ద క్యూ కూడా ఉంది అని తెలుస్తోంది.. గతంలో చంద్రబాబు ఇలా రాజ్యసభ సీట్లని అమ్ముకున్నారని జగన్ తీవ్రస్ధాయిలో విమర్శలు చేసేవారు, వైసీపీ దీనిని విమర్శించేది.

మరి తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు వచ్చే ఏడాది ఈ రెండు సీట్లు ఎవరికి ఇస్తారు కచ్చితంగా పార్టీలో ఉన్న సీనియర్లకు ఇస్తారా లేదా మరెవరికి అయినా ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి ఈ సీట్లు ఇచ్చే అవకాశం ఉండదు అంటున్నారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఈ పదవులు ఇస్తారు అని సీనియర్లు అంటున్నారు.. అయితే కచ్చితంగా పారిశ్రామిక వేత్తలకు జగన్ ఈ పదవులు ఇస్తే టీడీపీ వదిలిపెట్టే అవకాశం ఉండదు అని అంటున్నారు కొందరు మేధావులు.. గతంలో జగన్ చేసిన ఆరోపణలు అప్పుడు వైసీపీ చేస్తుంది అని ముందుగానే హెచ్చరిస్తున్నారు