జగన్ పై టీడీపీ సంచలన కామెంట్స్

జగన్ పై టీడీపీ సంచలన కామెంట్స్

0
75

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు… అధికార వైసీపీ నాయకులకు రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం చేత కాకపోతే చెప్పండి తాము చేసి చూపిస్తామని నాని అన్నారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దికి బదులుగా విధ్వంసం సృష్టిస్తోందిని ఆయన ఎద్దేవా చేశారు… అలాగే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు…

ఆయన ఢిల్లీకి వెళ్లింది రాష్ట్ర అభివృద్ది కోసమా లేక సొంతపనుల నిమిత్తం కేంద్రమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకా అని నాని ప్రశ్నించారు… కాగా పార్లమెంట్ సమావేశంలో నాని తన వాయిస్ వినిపించారు… ఏపీలో జర్నలిస్ట్ హత్యపై ఆయన ప్రస్తావించిన సంగతి తెలిసిందే…