అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇద్దరు రాజీనామా చేయక తప్పదు… రాజ్యసభ ఎన్నికల ప్రక్రియపూర్తి అయిన వెంటనే మంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేయనున్నారు… అయితే వీరి స్థానంలో ముఖ్యమంత్రి జగన్ ఎవరిని తీసుకోనున్నారు మంత్రి వర్గంలోకి ఇతర సభ్యులను తీసుకుంటారా లేక ఆ బాధ్యతలను ఇతర మంత్రులకు అప్పగిస్తారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న…
శాసనమండలి రద్దు అవుతుందనే ధీమతో జగన్ ఉన్నారు… కొంత ఆలస్యం అయినా సరే మండలి రద్దు గ్యారంటీ అన్న సంకేతాలు ఢిల్లీ నుంచి ఉన్నాయి… అందుకే ఆయన పిల్లి సుభాస్ చంద్రబోస్ ను మోపిదేవిని రాజ్యసభకు పంపించనున్నారు… బోస్ రాజీనామాతో మరోకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి…
అయితే జగన్ అదే సామాజిక వర్గానికి చెందిన పొన్నాడ సతీష్ కుమార్ కు అలాగే విడుదల రజనికి మంత్రిపదవి ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి… విడుదల రజని తొలి ఎమ్మెల్యే కావడంతో ఆమెకు ఛాన్స్ దక్కదని చర్చ జరుగుతోంది… ఎందుకంటే అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ మంత్రిగా ఉన్నారు… అందుకే ఆమెకు జగన్ కేబినెట్ లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చర్చించుకుంటున్నారు…
—