జగన్ కుమార్తెలని టార్గెట్ చేసిన టీడీపీ నేతలు

జగన్ కుమార్తెలని టార్గెట్ చేసిన టీడీపీ నేతలు

0
126

ఏపీలో కరోనా వైరస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, ఒకే ఒక్క పాజిటీవ్ కేసు నమోదు అయింది.. ఆస్పత్రిలో ప్రత్యేకంగా అతనికి చికిత్స అందిస్తున్నారు, అయితే ఇప్పుడు స్ధానిక సంస్ధల ఎన్నికలు రద్దు చేయడంతో తెలుగుదేశం వైసీపీ మధ్య ఈ కరోనా వైరస్ వ్యాప్తికంటే పెద్ద బిగ్ ఫైట్ జరుగుతోంది, ఎన్నికలు వాయిదా వేయడాన్ని వైసీపీ తప్పు పడుతుంటే టీడీపీ సపోర్ట్ చేస్తోంది ఈసీ చర్యని.

అయితే తాజాగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎందుకు జగన్ ఏపీలో పిల్లలకు స్కూల్స్ సెలవు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు, అంతేకాదు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం జగన్ పై విమర్శలు చేశారు..
పేరాసిట్మాల్ వేస్తే కరోనా పారిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ జల్లితే కరోనా చచ్చిపోతుందని సీఎం జగన్
గారు సెలవిచ్చారు. అసలు కరోనా పెద్ద విషయమే కాదు అన్న జగన్ గారు ఆయన ఇద్దరు కుమార్తెలను లండన్ నుండి ఎందుకు వెనక్కి పిలిపించారు అని ప్రశ్నించారు.

అంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదు. రాష్ట్రంలో ఉన్న పిల్లలు కరోనా బారిన పడినా పర్వాలేదు. జగన్ గారి కుటుంబం మాత్రం హాయిగా తాడేపల్లి కోటలో సురక్షితంగా ఉండాలి. జగరోనా కి ఇంత స్వార్ధమా అని ఆయన ప్రశ్నించారు.