జగన్ డెసిషన్ బెస్ట్… చంద్రబాబబాబు డెసిషన్ వేస్ట్… బీజేపీ

జగన్ డెసిషన్ బెస్ట్... చంద్రబాబబాబు డెసిషన్ వేస్ట్... బీజేపీ

0
78

ఏపీ నాయకుల్లో రాజధాని విషయంలో భిన్న స్వారాలు వినిపిస్తున్నాయి… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనా వంటివారు రాజధానిని అమరావతిలో ఉంచాలని డిమాండ్ చేస్తుంటే…. ఇక ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు చెందిన బీజేపీ నాయకులు మూడు రాజధానులకు జై కొడుతున్నారు…

తాజాగా ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు మరోసారి మద్దతు పలికారు… విశాఖ పట్నంలో రాజధాని ఏర్పాటుకు తాను మద్దతునిస్తున్నట్లు ఆయన తెలిపారు…రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన ప్రదేశమని అన్నారు…

అమరావతి రాజధాని పనికిరాదని గతంలో శివరామ కృష్ణ చెప్పిందని అన్నారు… కానీ చంద్రబాబు నాయుడు ఆ కమిటీని పట్టించుకోలేదని అన్నారు… వికేంద్రీకరణ ద్వారా అభివృద్ది సాధ్యం అని అన్నారు..