జగన్ ఎఫెక్ట్ సైలెంట్ అయిన పురందేశ్వరి

జగన్ ఎఫెక్ట్ సైలెంట్ అయిన పురందేశ్వరి

0
83

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రాజకీయాల్లో హీటెక్కిస్తోంది… టీడీపీ, జనసేనలు మూడు రాజధానుల ప్రతిపాధనను వ్యతిరేకిస్తున్నాయి.. ఇక బీజేపీలో మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి… రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మరికొంతమంది రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం అని రాజధానిపై ప్రకటన వచ్చిన తర్వాత స్పందిస్తామని అంటున్నారు…

అయితే వీరి వ్యాఖ్యలు ఎలా ఉన్నా రాజధాని విషయంలో మాజీ మంత్రి పురందేశ్వరికి కాస్త ఇబ్బందిగానే అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…. ఇటీవలే ఆమె కూడా అమరావతికే జై కొట్టినప్పటికీ ఆ తర్వాత నుంచి సైలెంట్ అయ్యారు…

దీనికి బలమైన కారణం ఉందని అందట… గతంలో ఆమె విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలిచారు.. 2014 ఎన్నికల్లో టీడీపీలో పొత్తులో భాగంగా రాజంపేటలో పోటీ చేసి ఓటమి చెందిన 2019 ఎన్నికల్లో తిరిగి విశాఖలో పోటీ చేసినా ఓటమి చెందారు…

అలాంటి పురందేశ్వరి విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ప్రచారం మొదలైందట అందుకు ఆమె రాజధాని అంశం పై మాట్లాడకుందట… రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత బీజేపీ నిర్ణయం మేరకు ఆమె స్పందించాలని చూస్తున్నారట…