జగన్ కు కొత్త టెన్షన్ తెప్పిస్తున్న లోకేశ్
ఇసుక నుండి తైలం తీసిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఘనులు పేదవారిని కూడా విడిచిపెట్టడం లేదని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు.. . ప్రభుత్వం పేదలకు అందించే వైద్య సేవని ఆదాయ వనరుగా మార్చుకోవాలని అనుకోవడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు.
నిరుపేదలకు వైద్యాన్ని దూరం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచపోతారని లోకేశ్ ఎద్దేవా చేశారు… ప్రజలపై బలవంతంగా వైసీపీ రంగులు పులిమెందుకు రూ.1300 కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆయన ఆరోపించారు…
వైద్యం కోసం వచ్చే పేదలకు ఉచితంగా సేవలు అందించలేరా అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు లోకేశ్ ? ప్రభుత్వ బోధనాసుపత్రులలో పేదల నుండి డబ్బు వసూలు చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు…