శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదని ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటోందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు… అమరావతి రైతులకు న్యాయం చెయ్యమని అడిగినందుకు అక్రమ అరెస్టులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాఠీలతో ఉద్యమాన్ని అణిచివేయాలి అనుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనం అని లోకేశ్ వ్యాఖ్యానించారు.. .ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల తరపున పోరాటం ఆగదని లోకేశ్ హెచ్చరించారు… కాగా అమరావతిలో విపక్షాలు జాతీయ రహదాని దిగ్బందానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే… దీంతో లోకేశ్ చినకాకానికి చేరుకున్నారు..
ఈనేపథ్యంలోనే శాంతిబధ్రతలరిత్య ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు… ఆయనతోపాటు మరికొందరి టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు… అరెస్ట్ చేసిన వారందరిని పోలీస్ వాహనంలో యనమల కుదురు పీఎస్ కు తరలించారు…