జగన్ కు లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్

జగన్ కు లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్

0
80

ఏడు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తవ్వుతోంది అవినీతి కాదని వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని లేకేశ్ ఆరోపించారు. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే జగన్ అవే పాత కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. 4,075 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని అన్నారు

5 ఏళ్ల టీడీపీ పాలనలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు 1170 ఎకరాలని అన్నారు లోకేశ్. అయితే 4,075 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో భ్రమల్లో భ్రతుకుతున్న వైసీపీ నాయకులు, ఉపసంఘం మేధావులు చెప్పాలని డిమాండ్ చేశారు లోకేశ్.

అంతేకాదు ఈ ఉపసంఘం నివేదికపై ఓపెన్ ఛాలెంజ్ విసిరారు లోకేశ్. అమరావతిలో జగన్ ఆరోపిస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి తాము సిద్ధం అని సవాల్ విసిరారు. అదే సమయంలో గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు