జగన్ కు మద్దతు పలికిన చంద్రబాబు అత్యంత సన్నిహితుడు

జగన్ కు మద్దతు పలికిన చంద్రబాబు అత్యంత సన్నిహితుడు

0
86

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా సంచలన ప్రకటన చేశారు.. వేకేంద్రీకరణ దిశగా అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ రావచ్చు, విశాఖ పట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూల్ జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు…

దీనిపై చంద్రబాబు నిప్పులు చేరుగుతుంటే మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు స్వాగతిస్తున్నారు అలాగే రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు… మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ నిర్ణయానికి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే..

ఇదే క్రమంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తికి కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.. కర్నూల్ జిల్లాలో హైకోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని అన్నారు ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాను మొదటినుంచి కోరుతున్నానని అన్నారు..