జగన్ కు సపోర్ట్ చేసిని టీడీపీ ఎమ్మెల్యే…

జగన్ కు సపోర్ట్ చేసిని టీడీపీ ఎమ్మెల్యే...

0
86

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ గా నిలిచారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై కరణం బలరాం ప్రశంశలు కురిపించారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు… మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తూచా తప్పకుండా అమలు చేశారని అన్నారు… జగన్ సర్కార్ కు తాను అభినందనలు తెలుపుతున్నానని అన్నారు…

రాజకీయాల్లో ప్రస్తుతం విలువలు లేవని అన్నారు… ఇప్పటికైనా టీడీపీ ఓటమిపై సమీక్షించుకోవాలని బలరాం ఆరోపించారు… గత ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు…