జగన్ కు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

జగన్ కు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

0
84

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశం అసెంబ్లీలో ప్రకటించారు.. దీంతో దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది.. ముఖ్యంగా రైతులు కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు… రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి చివరకు మీరు ఇదేనా చేసే న్యాయం అని ఆరోపిస్తున్నారు, అయితే విశాఖకు రాజధాని తరలిపోతే ఇక్కడ పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది అని విమర్శలు టీడీపీ చేస్తోంది.

తాజాగా వైసీపీ నేతలు కూడా జగన్ నిర్ణయాన్ని సమర్దిస్తున్నారు కాని వైసీపీ ఎమ్మెల్యే భిన్నస్వరం వినిపించారు.
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీనికి అడ్డు చెప్పారు. అసెంబ్లీ, పరిపాలన విభాగం ఒకే చోట ఉండాలని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ కూడా ఒక్కచోటే ఉండాలని ఆయన అనుకుంటున్నాను అని తెలిపారు.

ఇది నా ఆలోచన మరి నా ఆలోచన అభిప్రాయాన్ని సీఎం జగన్కు కూడా తెలియజేస్తానని వెల్లడించారు. విశాఖను ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేయాలన్నారు. ఇక నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం సరైన నిర్ణయమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా భిన్నస్వరం వినిపించడం పై కొందరు ఆలోచన చేస్తున్నారు. ఈయనేనా, ఇంకా ఉన్నారా అనే ఆలోచన అనుమానం కొందరికి కలుగుతున్నాయి.