జగన్ మోహన్ రెడ్డిది బిజినెస్ మైండ్ కాదట…

జగన్ మోహన్ రెడ్డిది బిజినెస్ మైండ్ కాదట...

0
91

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మరోసారి టీడీపీ నేత బుద్దా వెంకన్న రెచ్చిపోయారు.. మీ ప్రతాపం ట్విట్టర్ లో కాదని జగనన్న మద్యం దుకాణం ముందు నిలబడి చూపించండిని ప్రశ్నించారు… మద్యపాన నిషేధం పేరుతో కోట్లు కొల్లగొడుతున్న
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది బిజినెస్ మైండ్ కాదని క్రిమినల్ మైండ్ అని బుద్దా వెంకన్న ఆరోపించారు…

ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో బ్రాండ్ల దందా మొదలు పెట్టిన వైసీపీ నేతలు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుగా లేదా ప్రశ్నించారు… మద్యపాన నిషేధం అమలై అందరూ తాగడం మానేసారు అని డప్పు కొడుతున్నారని ఆరోపించారు.. మరి మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు…

తప్పుడు లెక్కలు రాసే మీరే ఈ లాజిక్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పాలని అన్నారు. జగన్ కు మీకు డబ్బు పిచ్చి పోగొట్టేలా మనీ డీ-అడిక్షన్ సెంటర్లు పెట్టించుకోండి కాస్త ఉపయోగం ఉంటుందని అన్నారు.