జగన్ ని మరోసారి టార్గెట్ చేసిన లోకేశ్

జగన్ ని మరోసారి టార్గెట్ చేసిన లోకేశ్

0
75

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ నేత ఎమ్మెల్సీ లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు… జగన్ మాటలకు, చేతలకు.. ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత దూరం ఉందని ఎద్దేవా చేశారు…

జగన్ అసెంబ్లీలో ఎస్సీ కార్పోరేషన్ బిల్ ప్రవేశపెట్టిన రోజే, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుడి కట్టి, మీకు మద్దతు పలికిన తాజాగా ఒక దళితుడికి పట్టిన గతే ఉదాహరణ అని అన్నారు… వైసీపీకి మద్దతు పలికినందుకు చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది అంటే మీ పాలన ఎంత చెత్తగా ఉందో అర్థం అవుతుందని లోకేశ్ ఆరోపించారు…

దళితులపై వైసీపీ నాయకుల అకృత్యాలకు ఇది ఒక ఉదాహరణ అని అన్నారు… అందుకు సంబంధించిన ఒక వీడియోను లోకేశ్ ట్వీట్ చేశారు… ప్రస్తుతం నారాలోకేశ్ ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…