జ‌గన్ ని ట్రంప్ తో విందుకు పిల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన చంద్ర‌బాబు

జ‌గన్ ని ట్రంప్ తో విందుకు పిల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన చంద్ర‌బాబు

0
95

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్బంలో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో ప్ర‌త్యేక విందు ఏర్పాటు చేశారు.. అయితే దీనికి తెలంగాణ ముఖ్య‌మంత్రిని పిలిచారు కాని ఏపీ ముఖ్య‌మంత్రిని మాత్రం పిల‌వ‌లేదు..

దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఇదే వార్త గురించి అంద‌రూ చ‌ర్చ‌లు జ‌రిపారు.. విందు అయిపోయింది ట్రంప్ వెళ్లిపోయారు కాని ఈ విష‌యంపై చ‌ర్చ‌లు మాత్రం జనాలు రాజ‌కీయ నేత‌లు చేస్తూనే ఉన్నారు..

ఈ రోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ…తెలంగాణ కంటే ఏపీ పెద్ద రాష్ట్రం.. అయినప్పటికీ ఆహ్వానం అందలేదు. అమెరికా చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కేసులుండే వ్యక్తులను కలవరు. అది కూడా ఓ అడ్డంకి. కియా మోటార్‌స్ ఇక్కడ పెట్టారు.. కానీ, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడకూడదు అని అగ్రిమెంట్‌లోనే పెట్టారు. అంతర్జాతీయ కంపెనీలు కొన్ని విలువలు పాటిస్తాయి అందుకే ఇలా ఆహ్వ‌నం రాలేదు అని అన్నారు.