10 రోజుల ముందు సంచలన ప్రకటన చేసిన జగన్

10 రోజుల ముందు సంచలన ప్రకటన చేసిన జగన్

0
88

రాజకీయపార్టీల అధినేతలు, అధికార విపక్షాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాల్లో మునిగిపోయారు.. పొలిటికల్ గా హీట్ ఎక్కింది రాజకీయం. అయితే బాబు ఇచ్చిన హామీలు నెరవేరలేదు… ఓసారి నాకు అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యం తీసుకువస్తాను అంటున్నారు జగన్.. ముఖ్యంగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు ఈసారి ఎన్నికల్లో.

ఈసమయంలో వైసీపీ అధినేత జగన్ ఓ సంచలన ప్రకటన చేశారు…తాను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని జగన్ అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పేదల బతుకులు ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో అలా ఉన్నారు… బాబు మాత్రం దేశంలో అత్యంత సంపన్న సీఎంగా ఉన్నారు అని ఇలాంటి వారిని నమ్మకూడదు అని అన్నారు, నిరుద్యోగులు రైతులు యువత బాబు చేసిన మోసాన్ని ఈసారి నిలదీస్తారు అని అన్నారు ఆయన, మీ ఓటుతో ఈసారి బాబుకి బుద్ది చెప్పాలి అన్నారు. ప్రతీ సంవత్సరం మొదటి నెల అంటే జనవరిలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు. ప్రాజెక్టుల పనులు అన్నీ ఐదు సంవత్సరాల్లో పూర్తిచేసి చూపిస్తామని అన్నారు ఆయన.