ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ కు షాక్

ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ కు షాక్

0
57

జగన్ కు ఏపీ రాజకీయాల్లో సలహాలు ఇవ్వడానికి ఎవరూ దొరకక, ఉత్తరాధి నుంచి రాజకీయ సలహాలు ఇవ్వడానికి పీకేని తీసుకువచ్చారు. ఆనాటి నుంచి ఇప్పుడు రాజకీయాల వరకూ ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే నవరత్నాలు పాదయాత్ర ఏ సమయంలో ఎలాంటి హామీ ఇవ్వాలి ఇవన్నీ ఆయన నుంచి జగన్ తెలుసుకుని ప్రచారం చేస్తున్నారు.. ఇక పదుల సంఖ్యలో ముందు సర్వే టీం బీహార్ యూపీ నుంచి ఏపీకి దిగారు …ఇప్పుడు వందలాది మంది పీకే టీం ఎన్నికలకు మరో పది రోజుల ముందు కూడా సర్వే చేస్తున్నారు.. జనం పల్స్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటున్నారు.

ఇక ఎన్నికలకు పది రోజులు మాత్రమే సమయం ఉంది, ఇప్పుడు కూడా సర్వేల మీద ఆధారపడింది వైసీపీ.. ఏకంగా ఎవరు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు, టీడీపీ నేతలపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఇలాంటి విషయాలు పీకే సెంట్రల్ టీమ్ తెలుసుకుంటున్నారట. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మంత్రి నారా లోకేష్, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల బరిలో ఉండడంతో మంగళగిరిపై ప్రశాంత్ కిషోర్ టీమ్ ఫోకస్ చేసింది. సర్వేల పేరుతో తిరుగుతున్న పీకే టీమ్ను తెలుగు తమ్ముళ్లు గుర్తించారు. వీరు ప్రజల నుంచి పలు ప్రశ్నలు అడగడంతో తెలుగుదేశం నాయకులకు సమాచారం వచ్చింది, ఇలా సర్వే చేస్తున్న ఏడుగురు సభ్యుల్ని పట్టుకున్నారు, వీరిని పోలీసులకు అప్పగించారు, మొత్తానికి లోకేష్ ఎఫెక్ట్ మంగళగిరిలో ఆర్కేకి బలంగా తాకింది అని అంటున్నారు నేతలు.