ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు… అమరావతి ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి యుద్ధవాతావరణం తీసుకువచ్చరని ఆరోపించారు…
ఆయన మాత్రమే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారని మండిపడ్డారు లోకేశ్. ప్రజలు సంతోషంగా ఉండకూడదా అని ప్రశ్నించారు… ప్రజలను పొలాల్లో ముళ్ల కంచెలు వేస్తారా అని ఫైర్ అయ్యారు..
కొద్దికాలంగా అమరావతి గ్రామాలను పాకిస్తాన్ బోర్డర్ ని తలపించే విధంగా మార్చేసారని ఆరోపించారు. ఇది ఎంత దారుణంఅని అన్నారు… వైసీపీ ప్రభుత్వం రైతులను టెర్రరిస్టుల్లా చూస్తోందని ఆరోపించారు. ముళ్ల కంచెలు, పోలీసు లాఠీలతో దమనకాండ ఆపాలని కోరారు లోకేశ్…