జగన్ సై… చంద్రబాబు సైసై… తాడోపేడో తేల్చుకుందాం..

జగన్ సై... చంద్రబాబు సైసై... తాడోపేడో తేల్చుకుందాం..

0
84

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… ఒక్క అవకాశం ఇస్తే ఏమైందో పది నెలలుగా చూస్తున్నామని మండిపడ్డారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికలకు నిఘా యాప్ కు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు…

గతంలో ఎన్నడు ఇంత గజిబిజిగా ఎన్నికలు నిర్వహించలేదని చంద్రబాబు అన్నారు… అంతేకాదు రిజర్వేషన్లు ఇష్టానుసారం ప్రకటించారని ఆరోపించారు.. ఎన్నికలపై ప్రభుత్వం నిఘా పెట్టేంత అవసరం ఏంటని ప్రశ్నించారు…

ముఖ్యమంత్రి జగన్ ఎలక్షన్ కమీషనర్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు… ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యామని స్పష్టం చేశారు చంద్రబాబు… ఎన్నికల్లో ఎవరు మధ్యం డబ్బులు పంచినా వెంటనే పోలీసులకు పట్టించాలని అన్నారు…