జగన్ పై లోకేశ్ ఆసక్తికర కామెంట్స్

జగన్ పై లోకేశ్ ఆసక్తికర కామెంట్స్

0
92

బీసీ రిజర్వేషన్ల పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని ఆరోపించారు టీడీపీ నేత లోకేశ్. ఆయన మనస్సాక్షే దానికి సాక్షి అని మండిపడ్డారు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు అని సుప్రీం కోర్టు చెప్పింది అంటూ కవరింగ్ ఇస్తున్నారు. మరి 59.85 శాతం రిజర్వేషన్ తో జీవో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు ఇది బీసీలను, మోసం చెయ్యటానికా అని ఆరోపించారు..

పక్క రాష్ట్రంలో 22 శాతం మాత్రమే బీసీ రిజర్వేషన్ ఉంది, మన రాష్ట్రంలో ఉంటే తప్పేంటి అంటూ రాతలు రాస్తారా? పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీ మర్చిపోయారా అని హెచ్చరించారు

రాష్ట్ర ప్రభుత్వం బీసీల హక్కుల కోసం, సుప్రీం కోర్ట్ లో వాదించాల్సింది పోయి, చిత్తశుద్ధితో ఆ పని చేస్తున్న తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారా? బీసీల పై జగన్ కి, ఎందుకంత కక్ష? 16 వేల మంది బీసీలకు అధికారం దూరం చేసి, మొత్తం మీరే ఏలుతారా అని లోకేశ్ ప్రశ్నించారు