జగన్ సర్కార్ పై చంద్రబాబు సెటైర్స్

జగన్ సర్కార్ పై చంద్రబాబు సెటైర్స్

0
90

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తీసుకుంటున్న నిర్ణయాలను అలాగే వారు ప్రవేశ పెడుతున్న పెట్టిన పాలసీలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెటైర్స్ వేశారు… పేరుకు మాత్రమే పాలసీ అని దాని వెనుక వైసీపీ మాఫియా దోపిడీ, అరాచకాలు ఉంటాయని చంద్రబాబు ఆరోపించారు.

అది ఇసుక పాలసీ అయినా, మద్యం పాలసీ అయినా దోచుకోడమే వైసీపీ నేతల లక్ష్యం అని సామాన్యుడే ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పే ధైర్యం ఉందా అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు…

పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక అక్రమ రవాణాను నిరోధించలేరా అని ప్రశ్నించారు… అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్ ను అడ్డుకోలేరా ప్రశ్నించారు …నాటుసారా, కల్తీ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేయలేరా అని అన్నారు