2022లో జమిలీ ఎన్నికలు…?

2022లో జమిలీ ఎన్నికలు...?

0
106

వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం కమలనాదుల్లో ఎప్పటినుంచో ఉంది…. అందుకు తగిన అవకాశం కోసం వారు ఎదురు చూస్తూ వచ్చారు… 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ ఘన విజయం సాధించడం 2019 ఎన్నికల్లో అంతకు మించిన విజయాన్ని సోంతం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయడంతో తెరపైకి మళ్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం వచ్చింది…

కేంద్రంలో బీజేపీ నేతలు బలంగా ఉన్నారు… ఇక రాష్ట్రాల్లో పరిస్థితి అశాజనికంగా లేకపోవడంతో మోడీ ఇమేజ్ తో దేశ వ్యాప్తంగా ఒకే సారి క్లీన్ స్వీప్ చేయాలన్న ప్రధాన లక్ష్యంతోనే కేంద్రంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన కదలికలు మొదలయ్యాయని వార్త వస్తున్నాయి…

వాస్తవానికి కరోనా మహమ్మరి రాకుండా ఉండి ఉంటే ఇప్పటికే అందుకు సంబంధించిన కార్యచరన పూర్తియి ఉండేది… అనూహ్యంగా కరోనా రావడంతో ఎన్నికల వ్యూహం కాస్త జాప్యం కలిగింది… 2022లో జమిలీ ఎన్నికలను నిర్వహించి యావత్ దేశాన్ని పరి పాలనా పరంగా తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలన్న దిశగా కాషాయధారులు సర్వం సన్నాహాల్లో ముగినట్లు వార్తలు వస్తున్నాయి