జేసీకి పోలీసులు షాక్…

జేసీకి పోలీసులు షాక్...

0
90

తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది… ఆయనపై అనంతపురం జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు త్రిలోక్…. దివాకర్ రెడ్డిపై లిఖిత పూర్యకంగా ఫిర్యాదు చేశారు… దీంతో రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై 153 అలాగే 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు…

అంతేకాదు ఇటీవలే ఆయన పై చాలా ఫిర్యాదు వచ్చాయని 153 అలాగే 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన డీఎస్పీ తెలిపారు… కాగా జేసీ ఇటీవలే పోలీసులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను బూట్లు నాకిస్తానని వ్యాఖ్యానించారు…

ఇక జేసీ వ్యాఖ్యాలపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా స్పందించారు… శాంతి భద్రతల కోసం నిత్యం పనిచేస్తున్న పోలీసులను కించపరిచేలా మాట్లాడటం మంచిదికాదని మాధవ్ అన్నారు.. పోలీస్ వ్యవస్థలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీ లు మంత్రులు అయ్యే సమర్థులు ఉన్నారని అందుకే జేసీ దివాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జెసి దివాకర్ రెడ్డి కథ ముగిసిపోయిందని అన్నారు.