జోరు పెంచిన సీఎం జగన్…

జోరు పెంచిన సీఎం జగన్...

0
32

ఏపీ రాజధాని ఐదేళ్లలోనే అమరావతి నుంచి తరలిపోతుందన్న ఆవేదనలో ఉన్న రైతులు స్థానికులకు జగన్ సర్కార్ తీపి కబురుచెప్పింది… రాజధాని వీకేంద్రీకరణ నేపథ్యంలో అమరావతిలో నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయబోమనే సంకేతాలు పంపుతోంది… ఈ మేరకు మూడు రోజులుగా అమరావతి గ్రామాల్లో పర్యటించిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రణాళికను స్పష్టం చేశారు.. గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణ పెంగింగ్ పనులు తిరిగి త్వరలోనే పట్టాలెక్కనున్నయి…

ఈ మేరకు జగన్ సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చింది… విశాఖకు రాజధాని తరలింపు నానాటికి ఆలస్యమవుతున్న తరుణంలో అమరావతిలో పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేసుకుంటే వీటిని వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించవచ్చనే ఆలోచనకు వచ్చింది… వీలైన చోట ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం కూడా లభిస్తుందని అంచనా వేస్తోంది… అందుకే నెలరోజుల్లో అమరావతిలో పెండింగ్ పనులు తిరిగి ప్రారంభమవుతాయని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు… ప్రస్తుతం రాజధాని తరలింపునేపథ్యంలో ఇక్కడ గ్రామాల ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది…

చంద్రబాబు ప్రభుత్వ తమకు ఇచ్చిన రాజధానిని జగన్ లాగేసుకుంటున్నారన్న అసంతృప్తి నెలకొంది. దీంతో తమకు అన్ని ప్రాంతాలకు సమానమేనన్న సంకేతాలు పంపేందుకు అమరావతిలోను అభివృద్ది మాత్రం జపించాలని వైసీపీ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది… ఇందులో భాగంగానే పురపాలక శాఖ మంత్రిరాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి స్థానికులతో మాట్లాడారు… ఆ తర్వాత రాజధాని పనులను నెల రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని ప్రకటన చేశారు.. ఇప్పటికే సిఆర్డీయే అధికారులు అమరావతిలో పెండింగ్ నిర్మాణాల పూర్తికి 18 వేల కోట్ల ఖర్చువుతుందనే అంచనాలను సీఎం జగన్ కు అందజేశారు..

దీంతో వీటిని దశల వారిగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నహలను చేస్తోంది… కరోనా వైరస్ రాకపోయి ఉంటే రాష్ట్రంలో ఇప్పటివరకే స్థానిక ఎన్నికలు పూర్తయ్యేవి వాటిలో వైసీపీ ప్రభుత్వ భవితవ్యం తేలిపోయేది… అయితే మూడు రాజధానుల నేపథ్యంలో వ్యతిరేకత లేదని చెప్పుకునేందుకు ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేసింది… పురపాలక సంఘాల పునర్ వ్యవస్తీకరణ పూర్తి కానందున ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు అప్పట్లో చెప్పుకుంది.. కానీ తాజాగా మారిన పరిస్ధితుల నేపథ్యంలో అమరావతిలో పెండింగ్ నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా ఇక్కడ ప్రజల్లో అభివృద్ది అజెండాను తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లోనూ లబ్ది పొందవచ్చని వైసీపీ సర్కార్ ఆలోచిస్తోంది…