చెప్పిందేంటి? జరుగుతున్నదేంటి?: జగన్‌పై కన్నా ఫైర్

చెప్పిందేంటి? జరుగుతున్నదేంటి?: జగన్‌పై కన్నా ఫైర్

0
94

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. గురువారం కాకినాడలో సంఘటన పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు జరుగుతున్నాయని చెప్పారు. సీఎం జగన్ మాటలకు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాటికి పొంతనలేదని విమర్శించారు. కులాలు, మతాలకు అతీతంగా పాలన జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించనందుల్లే ప్రపంచ బ్యాంకు రాజధానికి రుణం విషయంలో వెనక్కి వెళ్లిందని అన్నారు. విభజన హామీలు దాదాపు ఐదేళ్లలోనే పూర్తి చేశామన్నారు.