కర్నాటక రోడ్డుప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం..

0
90

క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురిగి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. క‌మ‌లాపుర‌లో వేగంగా వ‌చ్చిన ఓ ప్ర‌యివేటు బ‌స్సు జీపును ఢీకొట్టడంతో బ‌స్సులో మంట‌లు ఒక్కసారిగా చెలరేగి ఏడుగురు ప్ర‌యాణికులు అక్కడిక్కడే సజీవదహనం అయ్యారు. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టిన ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బాధపడ్డారు. తీవ్రంగా గాయపడిన పడిన వారికీ వైద్యులు సమక్షంలో మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ బాధను వ్యక్తం చేస్తున్నాడు.