భాజపా ముక్త్ భారత్‌ కావాలి..మోడీపై నిప్పులు చెరిగిన కేసీఆర్

0
108

పెద్దపల్లి జిల్లా తెరాస బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్, ప్రధానిమోదీపై విరుచుకుపడ్డారు. గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అని విరుచుకుపడ్డారు. ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేస్తున్నారు.

గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అడ్డగోలుగా పెంచారు. రూ.లక్షల కోట్ల మేర కుంభకోణాలు చేస్తున్నారు. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యంతో 70 మంది మృతికి కేంద్రం జవాబు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ హయాంలో దోపిడీ తప్ప మరొకటి లేదు. 60 ఏళ్లు కొట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం సాధించాం. దేశ ఆర్థిక విలువ దిగజార్చి.. రూపాయి విలువ పతనం చేశారు. మోసపోతే గోసపడుతాం,  భాజపా ముక్త్ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కావాలి అని కేసీఆర్ అన్నారు.