మేము ఎక్కడికి వెళ్లం కియా ప్రకటన షాక్ లో ఎల్లో పత్రికలు

మేము ఎక్కడికి వెళ్లం కియా ప్రకటన షాక్ లో ఎల్లో పత్రికలు

0
97

ఏపీలో ఉదయం నుంచి కియా ప్లాంట్ తరలి పోతోంది అని అనేక వార్తలు వినిపించాయి.. ఈ ప్లాంట్ తమిళనాడు తరలి వెళ్లిపోతోంది అనేలా తెలుగుదేశం నేతలు కొన్ని మీడియాలు వార్తలు వదిలాయి ..అయితే దీనిపై కియా కూడా క్లారిటీ ఇచ్చింది,బయట జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం అనితెలిపింది.

ఈ వార్త విని మేము షాక్ అయ్యాము.. అసలు మేము ప్లాంట్ తరలించాలి అని ఆలోచన చేయలేదు అని తెలిపారు,110 కోట్ల డాలర్ల విలువైన ప్లాంట్ను తమిళనాడుకు తరలించే యోచనలో కియా మోటార్స్ ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయటర్స్ రాసిన కథనాన్ని సంస్థ ఖండించింది. ఇది పూర్తి అవాస్తవ వార్త అని తెలిపింది.

అసలు ఎవరిని సంప్రదించకుండా ఇలాంటి కథనాన్ని ఎలా ప్రచురిస్తారు అని కంపెనీ ప్రతినిధులు సీరియస్ అయ్యారు,ఇలాంటి చెత్త వార్తలను పట్టించుకోవక్కర్లేదు అనేలా చెప్పింది కంపెనీ.. దీనిపై ప్రభుత్వ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు అసలు ఇది అవాస్తవం అని కొందరు చేసిన ప్రచారం అని తెలిపారు.