కొత్త సంవత్సరం రైల్వే ప్రయాణికులకు షాక్ భారీగా పెరిగిన చార్జీలు

కొత్త సంవత్సరం రైల్వే ప్రయాణికులకు షాక్ భారీగా పెరిగిన చార్జీలు

0
71

కొత్త సంవత్సరం తొలిరోజు రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది సర్కార్ , కొద్ది మొత్తంలో ధరలు పెంచింది.వివిధ ప్యాసింజర్‌ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ మంగళవారం ప్రకటించారు. దీంతో ఈ చార్జీలు ఎంత మేర పెరిగాయి అనేది ప్రయాణికులు తెలుసుకుకోవాలి అని అనుకుంటున్నారు మరి ఆ చార్జీలు చూద్దాం.

సాధారణ నాన్‌ ఏసీ రైళ్లకు ఈ చార్జీలు కిలోమీటరకు ఒక పైసా పెరగనుండగా.. నాన్‌ ఏసీ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరుగుతాయి. ఇక అన్ని ఏసీ తరగతులకు కిలోమీటరుకు 4 పైసల చొప్పున పెరుగుతున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి.

సబర్బన్‌ రైళ్లు మినహా రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్‌, తేజస్‌, హమ్‌ సఫర్‌, మహామన, గతిమాన్‌, గరీబ్‌రథ్‌, అంత్యోదయ, జనశతాబ్ది తదితర రైళ్లన్నింటికీ ఈ చార్జీల పెంపు వర్తిస్తుందని వివరించాయి. ఈ పెరిగిన రైలు చార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇక ఈ రోజు నుంచి కొత్తగా బుక్ చేసుకునే టిక్కెట్లకు మాత్రమే వర్తిస్తుంది, పాత టికెట్స్ ఆన్ లైన్ టికెట్స్ చేసుకున్న వారికి వర్తించదు అని తెలిపారు అధికారులు.. 2014 -2015 తర్వాత రైల్వే చార్జీలు పెంచడం ఇదే.