కృష్ణా జిల్లాలో మరో టీడీపీ బిగ్ వికెట్ డౌన్

కృష్ణా జిల్లాలో మరో టీడీపీ బిగ్ వికెట్ డౌన్

0
86

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృష్ణా జిల్లాలో మరో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ఇప్పటికే గుడివాడ ఇంచార్జ్ దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు…. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే…

ఆయన కూడా మంచి ముహూర్తం చూసుకుని జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి… వీరిచ్చిన షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కొలుకోక ముందే త్వరలో మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు… పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబం రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని చూస్తోందనివార్తలు వస్తున్నాయి…

గతంలో పిన్నమనేని వైఎస్సార్ హాయంలో మంత్రిగా పనిచేశారు…. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీ తీర్ధం తీసుకున్నారు ఆ ఎన్నికల్లో గుడివాడ సీటుని ఆశించారు కానీ దక్కలేదు.,.. ప్రస్తుతం ఆప్కాబ్ చైర్మన్ గా పనిచేస్తున్నా అది ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి…

పిన్నమనేని కుటుంబానికి చెందిన బాబ్జి ప్రస్తుతం ప్రస్తుతం గుడివాడ అర్భన్ బ్యాంక్ చైర్మన్ గా పని చేస్తున్నా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… రానున్న రోజుల్లో కృష్ణా జిల్లా నుంచి పిన్నమనేని కుటుంబం ఔట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు…