లగడపాటి సోదరుడు సర్వే – ఫలితాలు చూసి షాకైన బాబు

లగడపాటి సోదరుడు సర్వే - ఫలితాలు చూసి షాకైన బాబు

0
86

ఈ సారి ఎగ్జిట్ పోల్స్ చాలా ఆసక్తిని కలగించాయి.. సగం వైసీపీకి సగం తెలుగుదేశం పార్టీకి గెలుపు ఇవ్వడంతో, గెలుపు ఎవరిది అనేది మాత్రం అంత సులువుగా ఎవరూ చెప్పలేకపోతున్నారు ..తాజాగా వచ్చిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉంటే, లగడపాటి రాజగోపాల్ సర్వే రిపోర్టు కూడా ఏపీలో చర్చకు కారణం అయింది. ఆయన సర్వే ప్రకారం ఏపీలో మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పారు. 100 సీట్లు తెలుగుదేశం సాధిస్తుంది అని చెబుతున్నారు. ఇక వైసీపీ గట్టిపోటీ ఇస్తుంది అని ఆయన చెబుతున్నారు.. అయితే ఆయన సర్వేలు గతం నుంచి చూస్తే, తమిళనాడు ఫలితాలు ఫెయిల్, కర్నాటక ఫలితాలు ఫెయిల్, తెలంగాణ ఫలితాలు ఫెయిల్ అయ్యాయి, ఎక్కడా వాస్తవంగా చెప్పలేదు. అందుకే ఏపీలో కూడా ఇది నిజం కాదు అని చెబుతున్నారు. ఇక తాజాగా ఆయన సోదరుడు ల్యాంకో ఇండస్ట్రీ అధినేత లగడపాటి మధుసూదన్ తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏ తీరులో ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పారు.

జిల్లాల వారీగా ఆయన వెల్లడించిన ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. లగడపాటి మధుసూదన్ అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ కు 106 స్థానాలు పక్కాగా వస్తాయని అసెంబ్లీలో వైసీపీ ఎక్కువ స్ధానాలు గెలుస్తుంది అని చెప్పారు.. ఇక సెకండ్ పొజిషన్లో టీడీపీ 68 సీట్లు.. జనసేనకు ఒక్క సీటు మాత్రమే వస్తుందని అది కూడా పవన్ సీటు అని ఆయన చెబుతున్నారు. ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. మధుసూదన్ అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు 18 నుంచి 21 ఎంపీ సీట్లు వరకు వచ్చే వీలుందని.. బాబుకు నాలుగు నుంచి ఆరు ఎంపీ సీట్ల వరకు అవకాశం ఉందంటున్నారు. మధుసూదన్ చేయించిన సర్వే ప్రకారం.. ఏపీలో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పారు. మరి జిల్లాల వారీగా ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్కెయ్యండి.

జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీ జనసేన

శ్రీకాకుళం 5 5 —
విజయనగరం 5 4 —
విశాఖపట్నం 7 7 1
తూర్పు గోదావరి 10 9
పశ్చిమగోదావరి 8 7
కృష్ణా 11 5
గుంటూరు 8 9
ప్రకాశం 7 5
నెల్లూరు 8 2
చిత్తూరు 10 4
కడప 9 1
అనంతపురం 6 8
కర్నూలు 12 2