ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న నిర్ణ‌యం

ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న నిర్ణ‌యం

0
88

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మే 19న దేశంలో అన్ని ద‌శ‌లు ఎన్నిక‌లు ముగుస్తాయి కాబ‌ట్టి ఆయ‌న తన స‌ర్వేని విడుద‌ల చేయాలి అని రెడీగా ఉన్నారు.. అయితే తెలుగుదేశం పార్టీకి వైసీపీ నేత‌ల‌కు ఇప్పుడు ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఎలా వ‌స్తుందా అని చూడాలి అని ఉంది.. అయితే ఈసారి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ నెంబ‌ర్ కాదు ఎవరు ఎక్క‌డ గెలుస్తారు అని చెప్ప‌నున్నారట.. ఈసారి త‌న స‌ర్వే చాలా డిఫ‌రెంట్ గా చేశారు అని తెలుస్తోంది. ఈసారి ఆయ‌న స‌ర్వే కూడా మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్ని సీట్లు వైసీపీ తెలుగుదేశం జ‌న‌సేన పార్టీలు గెలుస్తాయి అని చెప్ప‌నున్నారు.. ఇలా ఈసారి ల‌గ‌డ‌పాటి కొత్త ప్ర‌యోగం చేయ‌నున్నారు అని తెలుస్తోంది.

మ‌రి పందాలు వేసిన వారు కూడా ల‌గ‌పాటి స‌ర్వే ఇప్పుడు ఇలా చెబితే చాలా బెట‌ర్ అని అంటున్నారు… మాకు కూడా కాస్త రిలీఫ్ దొరుకుతుంది అని చెబుతున్నారు.. ఇక ఈ మాజీ ఎంపీగారు ఇప్పుడు రాజ‌కీయాలకు దూరంగా ఉన్నా, ఇలా ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల స‌ర్వేల‌తో మ‌రింత ద‌గ్గ‌ర అయ్యారు…మ‌రి ఇప్పుడు నిజంగా ఆయ‌న ఎక్క‌డ ఎవ‌రు గెలుస్తారు అనేది చెబితే ఇది చ‌రిత్ర అని చెప్పాలి.. తెలంగాణ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాలులా కాకుండా ఈసారి నిజం అవ్వాలి అని కూడా కోరుకుంటున్నారు ఆయ‌న అభిమానులు.. మ‌రి చూడాలి ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఎలా ఉంటుందో.