వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు నాయకులతో ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదు అని తెలుస్తోంది.. అయితే ఎన్నికలు అయ్యాయి ఫలితాల కోసం పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు, ఇటు చంద్రబాబు అయితే ఏకంగా పార్లమెంట్ వైజ్ నేతలతో మంతనాలు రివ్యూ మీటింగులు జరుపుతున్నారు ..ఎలా జరిగింది మనకు పాజిటీవ్ ఎక్కడ ఉంది మొత్తం సర్వేలు నాయకుల రిపోర్టులు చూసి ఫలితాలపై ఓ అంచనాలకు వస్తున్నారు.. ఇక జగన్ మాత్రం నాయకులకు ఇప్పుడు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు, ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అయింది.
ఓ రోజు బొత్స కుటుంబ సభ్యుల వివాహానికి జగన్ విశాఖ వెళ్లారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ‘అవెంజర్స్’ సినిమా చూశారు. పార్టీ అగ్ర నేతలకు మినహా ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. ప్రస్తుతం వేసవి విడిది కోసం జగన్ ఇతర ప్రాంతాలకు వెళ్లారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్కడికెళ్లారో ఎవరికీ తెలియదు. పార్టీ కార్యక్రమాలను విజయసాయిరెడ్డి, ఇతర నేతలు పర్యవేక్షిస్తున్నారు. మరికొందరు మాత్రం జగన్ లోటస్ పాండ్ లో ఉన్నారు అని చెబుతున్నారు.. మరి కొందరు అయితే ఆయన బెంగళూరు కారులో వెళ్లి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లి ఉంటారు అని చెబుతున్నారు ..అందుకే లోటస్ పాండ్ లో జగన్ అందుబాటులో లేరని అందుకే నో ఎంట్రీ అని చెబుతున్నారు పార్టీ శ్రేణులు.