స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా జగన్ కు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు…ఇక్కడ టీడీపీ ఆశలు ఆవిరి అవుతున్నాయి
గత ఎన్నికల్లో వైసీపీకి ఎంత ప్రజా ఆదరణ దక్కిందో, అంత ప్రజాధరణ మళ్లీ దక్కుతుంది అని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో చాలా చోట్ల ఏకగ్రీవం అవ్వడం చూస్తుంటే టీడీపీకి వణుకు మొదలైంది.. మళ్లీ వైసీపీ ఈ ఆరు వారాల తర్వాత పడిలేచిన కెరటంలా మారుతారు అని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఏది ఏమైనా కచ్చితంగా 90 శాతం సీట్లు జగన్ సాధించాలి అని అనుకుంటున్నారు.. అంతేకాదు క్షేత్ర స్ధాయిలో పునాదులు కదిలిపోయేలా టీడీపీ పరిస్దితి ఉంది, ఇక వైసీపీ నుంచి నేతలు బయటకు రావడం లేదు, పక్కన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి పార్టీ మారిపోతున్న నేతలు చాలా మంది ఉన్నారు ఇది టీడీపీకి జీర్ణించుకోలేని అంశం.
దీంతో గ్రామాల్లో టీడీపీకి మొత్తానికి పునాదులు కూడా కదిలిపోయే పరిస్దితి వచ్చింది.. ఇక 9 నెలల పాలనపై ప్రజల్లో పాజిటీవ్ పెరిగింది, అలాగే చంద్రబాబు పార్టీపై వ్యతిరేకత పెరిగింది. నవరత్నాలు కూడా అమలు చేయడం జనాలకు అర్ధమైంది. ఇవన్నీ జగన్ కు పాజిటీవ్ పెరిగేలా చేస్తాయి అంటున్నారు మేధావులు.