కోవిడ్ ఆసుపత్రుల్లో వసతులు అద్భుతం అంటూ అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు… వాస్తవానికి కరోనా రోగులకు భోజనం కూడా అందని పరిస్థితని మండిపడ్డారు. కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో భోజనం పెట్టండి మహాప్రభో అంటూ ఆందోళన చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు… .
ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్ల లో కరోనా రోగులు పడుతున్న బాధలు చూస్తుంటే బాధేస్తుందని అన్నారు లోకేశ్. టెస్టింగ్ కిట్లు, బ్లీచింగ్ కొనుగోలు పేరుతో కోట్లు మింగారు. ఇప్పుడు రోగులకు ఇచ్చే భోజనాన్ని కూడా వదకున్నారని ఆరోపించారు
అలాగే మీ పాలనా క్రూరత్వానికి సోదరుడిని కోల్పోయిన సోదరి ఆక్రోశం మీకు వినిపిస్తోందా
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారుఅన్నారు… చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా? కేసును నీరుగార్చాలని చూస్తే సహించమని అన్నారు. ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు లోకోశ్